సోనోవిజన్‌ లక్కీడ్రా విజేతలు

24 Mar, 2023 06:12 IST|Sakshi

పాతగుంటూరు: సోనోవిజన్‌ ఉగాది డిస్కౌంట్‌ సేల్‌ సందర్భంగా గుంటూరు సోనోవిజన్‌ కొనుగోలుదారులకు లక్కీడ్రాలో హోండా అమేజ్‌ కారు బహుమతిగా అందించినట్లు షోరూమ్‌ మేనేజింగ్‌ పాట్నర్‌ భాస్కరమూర్తి తెలిపారు. గుంటూరు లక్ష్మీపురం సోనోవిజన్‌ షోరూంలో గురువా రం సాయంత్రం జరిగిన లక్కీడ్రాలో హోండా అమేజ్‌ కారు, ఎల్‌ఈడీ టీవీ, రిఫ్రిజరేటర్‌, వాషింగ్‌మిషన్‌ బహు మతులుగా అందించడం జరిగిందన్నారు.. ఈ కార్యక్రమానికి గుంటూరు నగరపాలక సంస్థ మేయర్‌ కావటి శివనాగ మనోహర్‌ నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

సోనోవిజన్‌ కొనుగోలుదారుల సమక్షంలో జరిగిన లక్కీడ్రాలో హోండా అమేజ్‌ కారు గెలుపొందిన చేబ్రోలు కు చెందిన కె. సాయిరామ్‌ సొంతం చేసుకున్నారు. గణిత పూడిక చెందిన షేక్‌ మొహమ్మద్‌ ఖాసిం ఎల్‌ఈడీ టీవీ, గుంటూరుకు చెందిన కె.నాగమణి రిఫ్రిజరేటర్‌ను, గుంటూరు చెందిన కె.త్రినాథ్‌ వాషింగ్‌మిషన్‌ను గెలుపొందారు. తక్కువ ధరలు, నమ్మకమైన సేవలు అందిస్తూ రాష్ట్రంలో అతిపెద్ద ఎలక్ట్రానిక్‌ స్టోర్‌ సోనోవిజన్‌ అన్నారు. అన్ని పెద్ద కంపెనీలకు చెందిన 2023 ఎయిర్‌ కండీషనర్‌ మోడల్స్‌ అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. ఉగాది డిస్కౌంట్‌ సేల్లో వడ్డీగాని, డీబీడీ గాని లేకుండా ఫైనాన్స్‌ లాభదాయకంగా ఉంటుందన్నారు.

మొబైల్స్‌, ల్యాప్టాప్స్‌ ఎక్కువ డిస్కౌంట్‌ లభించడం తమ షోరూం ప్రత్యేకత అన్నారు. అంతే కాకుండా పది శాతం వరకు లభించే క్యాష్‌బ్యాక్‌ లాభదాయకంగా ఉందన్నారు. అందరికన్న తక్కువ ధరలలో సోనోవిజన్‌ సేల్‌, మరింత నమ్మకమైన సర్వీస్‌ అందిస్తామని అన్నారు.

మరిన్ని వార్తలు