సాగుదారులకు సంపూర్ణ హక్కులు

29 Nov, 2023 01:50 IST|Sakshi
హక్కు పత్రాలు పొందిన అనంతరం రైతులతో ఆర్డీఓ శ్రీకర్‌, తహసీల్దార్లు

ప్రత్తిపాడు: అసైన్డ్‌ భూములపై సాగుదారులకు ప్రభుత్వం సంపూర్ణ హక్కులు కల్పించినట్టు గుంటూరు ఆర్డీఓ పి.శ్రీకర్‌ చెప్పారు. కొత్త అసైన్‌మెంట్‌ పట్టాల పంపిణీతోపాటు 2003 సంవత్సరానికి ముందు అసైన్‌మెంట్‌ జరిగిన భూముల సాగుదారులకు, ల్యాండ్‌ పర్చేజ్‌ స్కీం ద్వారా పట్టాలు పొందిన లబ్ధిదారులకు నియోజకవర్గ కేంద్రం ప్రత్తిపాడులో మంగళవారం హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నియోజకవర్గ స్థాయిలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు ఆర్డీఓ శ్రీకర్‌ హాజరయ్యారు. లబ్ధిదారులకు హక్కు పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చట్టసవరణ చేసి, ప్రత్యేక ఆర్డినెన్స్‌ ద్వారా దశాబ్దాల తరబడి 22–ఏ నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూములపై సాగుదారులకు సంపూర్ణ హక్కులు కల్పించినట్టు వివరించారు. ఇది చారిత్రాత్మక నిర్ణయమని తెలిపారు. ఫ్రీహోల్డ్‌ రైట్‌ కింద 27.45 ఎకరాలకు గాను 35 మంది రైతులకు, ఎల్‌పీఎస్‌ కింద 69.34 ఎకరాలకు గాను 130 మంది రైతులకు హక్కు పత్రాలను పంపిణీ చేశామని పేర్కొన్నారు. అలాగే కొత్తగా 79 మంది రైతులకు 47.08 ఎకరాలకు అసైన్‌మెంట్‌ పట్టాలను పంపిణీ చేశామని ఆర్డీఓ వివరించారు. కార్యక్రమంలో ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను, వట్టిచెరుకూరు, గుంటూరురూరల్‌ మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.

గుంటూరు ఆర్డీఓ శ్రీకర్‌ కొత్తగా 79 మందికి అసైన్‌మెంట్‌ పట్టాల పంపిణీ మరో 165 మంది అసైన్డ్‌ లబ్ధిదారులకు హక్కు పత్రాలు

మరిన్ని వార్తలు