ఆసక్తికరంగా ఆద్యక్షరి విభావరి

27 Mar, 2023 01:16 IST|Sakshi
సంకీర్తన నిర్వహిస్తున్న పిస్కా సత్యనారాయణ

విద్యారణ్యపురి: జాతీయ సాహిత్య పరిషత్‌ ఆధ్వర్యంలో హనుమకొండలోని శ్రీరాజరాజనరేంద్రాంధ్ర భాషా నిలయంలో ఆదివారం సాయంత్రం పిస్కా సత్యనారాయణచే నిర్వహించిన సంకీర్తన ఆద్యక్షరి విభావరి ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. తొలుత రాజరాజనరేంద్ర భాషా నిలయం అధ్యక్షుడు చిలకమారి సంజీవ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలున్నాయన్నారు. సత్యనారాయణ లాంటి సాహితీవేత్తలు నూతన ప్రక్రియగా పద్య అధ్యక్షరిని సృష్టించారని అభినందించారు. ముఖ్యఅతిథిగా కంది శంకరయ్య మాట్లాడుతూ జాతీయ సాహిత్య పరిషత్‌ సాహితీవేత్తలను ప్రోత్సహిస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం పద ఆద్యక్షరి సృష్టికర్త పిస్కా సత్యనారాయణ సాహితీవేత్తలు అడిగిన మొదటి అక్షరానికి సంకీర్తనలు, పాటలు, కవితలు ఆశువుగా చెబుతూ సభికులను అలరించారు. కార్యక్రమంలో ప్రముఖ కవి తాడిచెర్ల రవి, సాహితీవేత్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు