పెండింగ్‌ చలాన్‌లు.. బైక్‌ తీసుకెళ్లిన పోలీసులు.. డ్యూటీకి వెళ్లలేననే మనస్తాపంతో

25 May, 2023 01:00 IST|Sakshi

వరంగల్: ట్రాఫిక్‌ చలాన్‌లు కట్టలేదని పోలీసులు వాహనాన్ని పట్టుకెళ్లారు. దీంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి పురుగుల మందు తాగగా చికిత్స పొందుతూ బుధవారం చనిపోయాడు. తన తండ్రి మృతికి ట్రాఫిక్‌ పోలీసులే కారణమని కుమారుడు సూర్య హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మృతుడి కుటుంబసభ్యులు, బంధువుల కథనం ప్రకారం.. మల్లారెడ్డిపల్లికి చెందిన పాలకుర్తి మొగిలి(54) నగరంలోని ఓ బట్టల షాపులో వర్కర్‌గా పనిచేస్తున్నాడు.

రోజూ మల్లారెడ్డిపల్లి నుంచి బైక్‌పై వరంగల్‌కు వెళ్లి విధులు నిర్వహించి తిరిగి రాత్రి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో ఆ బైక్‌పై 9 ట్రాఫిక్‌ ఉల్లంఘన చలాన్‌లు నమోదయ్యాయి. ఈ నెల 21న ట్రాఫిక్‌ పోలీసులు వాహన తనిఖీల్లో భాగంగా చూడగా చలాన్లు పెండింగ్‌లో ఉండడంతో వాటిని కట్టి బైక్‌ తీసుకెళ్లాలని చెప్పారు. దీంతె అతను మల్లారెడ్డిపల్లికి ఆటోలో వెళ్లాడు. వాహనం లేకపోవడం వల్ల విధులకు వెళ్లలేనని మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు.

గమనించిన కుటుంబ సభ్యులు వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. పోలీసులు వచ్చి రూ.3వేలు ఇచ్చి వెళ్లారని బంధువులు ఆరోపించారు.

మరిన్ని వార్తలు :


Advertisement

ASBL
మరిన్ని వార్తలు