పుష్పారెడ్డికి నాన్‌ కేడర్‌ ఎస్పీగా పదోన్నతి

10 Jun, 2023 01:54 IST|Sakshi

వరంగల్‌ క్రైం: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో క్రైమ్‌, ఆపరేషన్స్‌ అడిషనల్‌ డీసీపీగా, ట్రాపిక్‌, అడ్మిన్‌ ఇన్‌చార్జ్‌ డీసీపీగా పనిచేస్తున్న కర్రి పుష్పారెడ్డికి శుక్రవారం ప్రభుత్వం నాన్‌ కేడర్‌ ఎస్పీగా పదోన్నతి కల్పించింది.

2012 గ్రూప్‌–1 బ్యాచ్‌కి చెందిన పుష్పారెడ్డి 2014 నుంచి హైదరాబాద్‌ సీఐడీ, సైబర్‌ క్రైమ్‌ డీఎస్పీగా, 2018లో కల్వకుర్తి డీఎస్పీగా, 2019 నుంచి వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో క్రైమ్‌, ఆపరేషన్స్‌ అడిషనల్‌ డీసీపీగా పనిచేస్తున్నారు. 2020లో సెంట్రల్‌ జోన్‌ ఇన్‌చార్జ్‌ డీసీపీగా పనిచేశారు. ఈ మేరకు పుష్పారెడ్డికి సీపీ రంగనాథ్‌తోపాటు పలువురు పోలీస్‌ అధికారులు అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు