వీవీ ప్యాట్లపై అవగాహన ఉండాలి

12 Nov, 2023 01:08 IST|Sakshi
మీడియా సెంటర్‌లో కలెక్టర్‌, ఇతర అధికారులు

కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

హన్మకొండ అర్బన్‌: పోలింగ్‌ సందర్భంగా ఈవీఎంలతోపాటు వీవీ ప్యాట్లు పని చేసే విధానంపై అఽధికారులకు పూర్తి అవగాహన ఉండాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో అధికారులకు వీవీ ప్యాట్లు, ఈవీఎంలు పనిచేసే విధానంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ, ట్రెయినీ కలెక్టర్‌ శ్రద్ధా శుక్ల, ఇతర అధికారులున్నారు.

మీడియా సెంటర్‌ సందర్శన

కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల మీడియా సెంటర్‌ను కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ శనివారం సందర్శించారు. మీడియా సెంటర్‌ ద్వారా సమాచారం వేగంగా ఎప్పటికప్పుడు అందించాలన్నారు. పెయిడ్‌ న్యూస్‌ పరిశీలించాలని ఆదేశించారు. సమాచార శాఖ ఏడీ లక్ష్మణ్‌కుమార్‌, ఎంసీఎంసీ సభ్యులు భూపాల్‌, దాసరి కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.

ఎన్నికల అబ్జర్వర్‌ను కలిసిన కలెక్టర్‌

కాజీపేట అర్బన్‌: నగరానికి వచ్చిన అసెంబ్లీ ఎన్నికల జనరల్‌ అబ్జర్వర్‌ డాక్టర్‌ హెచ్‌ఎన్‌ గోపాలకృష్ణను శనివారం కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ నిట్‌లోని అబ్దుల్‌ కలాం గెస్ట్‌హౌజ్‌లో మార్యదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. ఈసందర్భంగా జనరల్‌ అబ్జర్వర్‌ ఎన్నికల నిర్వహణపై చేపడుతున్న ఏర్పాట్లపై ఆరా తీశారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ మహేందర్‌జీ పాల్గొన్నారు.

విధులకు మినహాయింపు ఇవ్వాలని వినతి

విద్యారణ్యపురి: జిల్లాలో పలు కేటగిరీల ఉపాధ్యాయులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని పీఆర్టీయూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మంద తిరుపతిరెడ్డి, జిల్లా జనరల్‌ సెక్రటరీ ఫలిత శ్రీహరి శనివారం కలెక్టర్‌ సిక్తాట్నాయక్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈనెల 30న జరిగే ఎన్నికల విధులకు గర్భిణులుగా ఉన్న ఉపాధ్యాయులకు, 70 శాతానికిపైగా అంగవైకల్యం, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఉపాధ్యాయులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.

మరిన్ని వార్తలు