అత్యధిక కేసులు పరిష్కరించాలి

20 Feb, 2024 01:16 IST|Sakshi
అధికారులకు ప్రశంసపత్రాలు అందజేస్తున్న న్యాయమూర్తి రాధాదేవి

వరంగల్‌ లీగల్‌: మార్చి 9న నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌లో అత్యధిక కేసుల పరిష్కారానికి ఆయా శాఖ అధికారులు కృషి చేయాలని వరంగల్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.రాధాదేవి పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన వివిధ శాఖ అధికారుల సమావేశంలో న్యాయమూర్తి కె.రాధాదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా గత డిసెంబర్‌ 30న నిర్వహించిన లోక్‌ అదాలత్‌ విజయవంతానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కృషి చేసిన అధికారులను అభినందించి, ప్రశంసపత్రాలు అందించారు. ఈసందర్భంగా న్యాయమూర్తి కె.రాధాదేవి మాట్లాడుతూ.. మార్చి 9న జరిగే లోక్‌ అదాలత్‌లో అత్యధిక కేసుల పరిష్కారానికి అధికారులంతా కృషి చేయాలని, గతంలో మాదిరిగానే మున్ముందు కూడా.. లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొని తమవంతుగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్‌.సాయికుమార్‌, డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ ఎం.సత్యనారాయణ, అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, పోలీస్‌, ఎకై ్సజ్‌ శాఖ అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లు, విద్యుత్‌ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మార్చి 9న లోక్‌ అదాలత్‌

వరంగల్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.రాధాదేవి

whatsapp channel

మరిన్ని వార్తలు