నిట్‌ ఎదుట పీహెచ్‌డీ స్కాలర్ల ధర్నా

20 Feb, 2024 01:16 IST|Sakshi
నిట్‌ మెయిన్‌ గేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న పీహెచ్‌డీ స్కాలర్లు

కాజీపేట అర్బన్‌: నిట్‌ వరంగల్‌కు చెందిన ఫస్ట్‌ ఇయర్‌ పీహెచ్‌డీ స్కాలర్లు హెచ్‌ఆర్‌ఏ (హౌస్‌ రెంట్‌ అలవెన్స్‌) కేటాయించాలని సోమవారం నిట్‌ మెయిన్‌ గేట్‌ ఎదుట ధర్నాకు దిగారు. 2020లో అప్పటి నిట్‌ డైరెక్టర్‌ పీహెచ్‌డీ స్కాలర్లకు వసతి కల్పించలేమని, బయట వసతి పొందితే హెచ్‌ఆర్‌ఏ అందజేస్తామని తెలిపారు. దీంతో పీహెచ్‌డీ స్కాలర్లు నిట్‌ బయట వసతి పొందుతూ హెచ్‌ఆర్‌ఏను అందుకుంటూ.. ఇంటి అద్దె చెల్లిస్తూ వస్తున్నారు. కాగా.. గతేడాది ఏప్రిల్‌లో బిద్యాధర్‌ సుబుదీ నిట్‌ డైరెక్టర్‌గా విధుల్లో చేరిన తర్వాత బయట వసతి పొందనవసరం లేదని క్యాంపస్‌లోనే వసతి కల్పిస్తామని, హెచ్‌ఆర్‌ఏ నిలిపేస్తామన్నారు. కానీ పీహెచ్‌డీ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులు జూన్‌ నుంచి నిట్‌ బయటనే వసతి పొందుతున్నారు. తమకు హెచ్‌ఆర్‌ఏ చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ నిట్‌ మెయిన్‌ గేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ఆతర్వాత కొద్దిసేపటికి నిట్‌ డైరెక్టర్‌ విద్యార్థులతో చర్చించారు. సెకండియర్‌ నుంచి ఫిఫ్త్‌ ఇయర్‌ వరకు పీహెచ్‌డీ స్కాలర్లకు హెచ్‌ఆర్‌ఏ ఇస్తామని హామీ ఇచ్చారు. మొదటి సంవత్సరం విద్యార్థులు మాత్రం కాలేజీలోనే వసతి పొందాలని ఆయన పేర్కొన్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు