నేడు మేడారానికి పగిడిద్దరాజు ప్రయాణం

20 Feb, 2024 01:18 IST|Sakshi
పూనుగొండ్లలో గద్దైపె ప్రతిష్ఠించిన పగిడిద్దరాజు పాన్పు

గంగారం: మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలోని గుడినుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజు మంగళవారం మేడారానికి బయలుదేరనున్నారు. ఈ మేరకు ఆలయంలో ప్రత్యేక పూజలు జరుపుతారు. అనంతరం గుట్ట నుంచి వనం తీసుకొచ్చే కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తారు. వనం తీసుకొచ్చే సందర్భంగా మహిళలు బిందెలతో నీళ్లు ఆరబోస్తారు. అనంతరం గద్దైపె పగిడిద్దరాజును ప్రతిష్ఠించి పెళ్లికొడుకుగా ముస్తాబు చేస్తారు. మధ్యాహ్నం తరువాత పూనుగొండ నుంచి మేడారానికి ప్రధాన పూజారులు కాలినడకన అరణ్యం గుండా తీసుకెళ్తారు. ఆ సమయంలో మహిళలు సంతు పడుతూ నీళ్లబోరుస్తూ పగడిద్దరాజును ఊరినుంచి సాగనంపుతారు. బుధవారం సాయంత్రం వరకు మేడారం గద్దైపెకి చేరుకుంటారు. అనంతరం భక్తుల దర్శనార్థం కొలుదీరుతారు.

whatsapp channel

మరిన్ని వార్తలు