బస్సుల్లో తల్లుల చెంతకు..

20 Feb, 2024 01:18 IST|Sakshi

ఆర్టీసీ ద్వారా 76,712 మంది భక్తుల ప్రయాణం

హన్మకొండ: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు ఆర్టీసీ బస్సుల ద్వారా సోమవారం రాత్రి 8 గంటల వరకు 76,712 మంది భక్తులు ప్రయాణించారు. ఈ నెల 18 నుంచి ఆర్టీసీ ప్రత్యేక పాయింట్ల నుంచి బస్సులు నడపుతోంది. ఈ రెండు రోజుల్లో 1,225 ట్రిప్పుల ద్వారా 44,961 మంది భక్తులు మేడారం చేరుకున్నారు. అదే విధంగా 1,223 ట్రిప్పుల ద్వారా 31,751మంది తిరుగు ప్రయాణమయ్యారు. ఈ నెల 18న 850 ట్రిప్పుల ద్వారా 31,690మంది ప్రయాణికులను మేడారం చేరవేయగా, 800 ట్రిప్పుల ద్వారా 22,731 మంది తిరుగుబాట పట్టారు. అదే విధంగా సోమవారం రాత్రి 8 గంటల వరకు 375 ట్రిప్పుల ద్వారా 13,271 మంది భక్తులు మేడారం చేరుకున్నారు. 400 ట్రిప్పుల ద్వారా 9020 మంది భక్తులు తిరుగు ప్రయాణమయ్యారు. మహిళలకు ఉచిత్ర ప్రయాణ సౌకర్యం కల్పించినా అధికారులు ఊహించిన మేరకు స్పందన కనిపించడం లేదు. 2020 జాతరకు దాదాపు సరిసమానంగా భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. జాతర 21 నుంచి 24 వరకు జరగనుంది. ఈ క్రమంలో వచ్చే ఐదు రోజుల్లో భక్తుల సంఖ్య పెరగొచ్చని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు