సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

21 Feb, 2024 01:38 IST|Sakshi
ఎస్పీలతో మాట్లాడుతున్న ఐజీ తరుణ్‌జోషి

ఐజీ తరుణ్‌జోషి

మేడారం (ఏటూరునాగారం): జాతరలో అన్ని ప్రాంతాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఐజీ తరుణ్‌జోషి అన్నారు. మంగళవారం మేడారం కమాండ్‌ కంట్రోల్‌ రూంలో ఎస్పీ, ఏఎస్పీలతో సమీక్షించారు. గతంలో కంటే ఈసారి అదనంగా పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేయించామన్నారు. వన్‌వే ద్వారా ప్రైవేట్‌ వాహనాలను తరలిస్తామని చెప్పారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సీసీ కెమెరాలు, డ్రోన్లతో మానిటరింగ్‌ చేస్తున్నట్లు తెలిపారు. నేడు (బుధవారం) సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులును తీసుకెళ్లే మార్గాలు, రోప్‌పార్టీలను సిద్ధం చేసి ఉంచాలని ఆదేశించారు. కేటాయించిన బీట్‌లో అనునిత్యం అందుబాటులో ఉండాలన్నారు. ఏ అవసరం ఉన్నా వెంటనే సెట్ల ద్వారా సమాచారం చేరవేయాలని సూచించారు. క్యూలైన్ల వద్ద ఎప్పటికప్పుడు భక్తుల రద్దీ లేకుండా వెంటవెంటనే పంపించాలన్నారు. ఆయన వెంట ఎస్పీలు శబరీష్‌, గాష్‌ఆలం, ఏఎస్పీలు ఉన్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు