ప్రైవేట్‌ ఆస్పత్రులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి

22 Feb, 2024 02:58 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రావీణ్య

ఖిలా వరంగల్‌: ప్రతి ప్రైవేట్‌ ఆస్పత్రి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.. నిబంధనల మేరకు ప్రజలకు సేవలందించాలి.. నియమాలను అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని వరంగల్‌ కలెక్టర్‌ ప్రావీణ్య హెచ్చరించారు. తెలంగాణ క్లినికల్‌ ఎస్టాబ్లిష్మెంట్‌, రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌లో భాగంగా ప్రైవేట్‌ ఆస్పత్రులు, ఆప్రూవల్‌, మెటర్నల్‌ డెత్‌సర్వేలెన్స్‌ రిపోర్ట్‌పై బుధవారం వరంగల్‌ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మాతృ, శిశుమరణాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, గర్భిణులు ఆస్పత్రుల్లో నమోదు చేసుకున్న వెంటనే వారికి నిరంతరం సేవలందించాలని చెప్పారు. సాధారణ ప్రసవాలు జరిగేలా ప్రోత్సహించాలని, ఈ మేరకు వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలని సూచించారు. అనంతరం ఆరు క్లినిక్‌లు, ఆస్పత్రులను కలెక్టర్‌ ఆమోదించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వెంకటరమణ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ గోపాల్‌రావు, డాక్టర్‌ పద్మశ్రీ, సీకేఎం సీఎస్సీ డాక్టర్‌ నిర్మల, డాక్టర్‌ నరసింహస్వామి, డాక్టర్‌ మనోజిలాల్‌ తదితరులు పాల్గొన్నారు.

వరంగల్‌ కలెక్టర్‌ ప్రావీణ్య

whatsapp channel

మరిన్ని వార్తలు