నేటినుంచి కానిస్టేబుళ్లకు శిక్షణ తరగతులు

22 Feb, 2024 02:58 IST|Sakshi

మామునూరు: ఖిలావరంగల్‌ మండలం మామునూరులోని పోలీస్‌ శిక్షణ కళాశాలకు ఇటీవల నియామకమైన 824 మంది శిక్షణ కానిస్టేబుళ్లు బుధవారం చేరుకున్నారు. ట్రెయినీ కానిస్టేబుళ్లకు తొమ్మిది నెలల పాటు ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ రమేశ్‌ ఆధ్వర్యంలో ట్రెయినింగ్‌ ఇవ్వనున్నారు. కాగా మామునూరు పీటీసీ పరేడ్‌ గ్రౌండ్‌లో నేటినుంచి (గురువారం) శిక్షణ ప్రారంభం కానుంది. కార్యక్రమానికి అడిషనల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ జనరల్‌ పోలీస్‌ (ఏడీజీఏ) విజయ్‌కుమార్‌(ఐపీఎస్‌) రానున్నారని రమేష్‌ తెలిపారు.

బాలల అక్రమ రవాణాను అరికట్టాలి

ఎమ్మెల్యే కేఆర్‌.నాగరాజు

హన్మకొండ: మానవ, బాలల అక్రమ రవాణా, బాల్య వివాహాలను అరికట్టడంతోపాటు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌.నాగరాజు అన్నారు. ఎఫ్‌ఎంఎం సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో హసన్‌పర్తి మండలం బైరాన్‌పల్లిలో బాలల అక్రమ రవాణా నిరోధంపై ముద్రించిన వాల్‌ పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. ఎఫ్‌ఎంఎం సాంఘిక సేవా సంస్థ హసన్‌పర్తి మండల కో–ఆర్డినేటర్‌ ఈసంపల్లి సుదర్శన్‌, సీఐ సురేష్‌ పాల్గొన్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు