హిజ్రాల బీభత్సం

24 Feb, 2024 01:42 IST|Sakshi
గేట్లు ధ్వంసం కావడంతో బారికేడ్లు పెట్టిన పోలీసులు

ప్రధాన ద్వారాన్ని ధ్వంసం చేసిన ట్రాన్స్‌జెండర్లు

మేడారం(వరంగల్‌ క్రైం) : మేడారం మహాజాతరలో హిజ్రాలు శుక్రవారం బీభత్సం సృష్టించారు. ప్రత్యేకంగా అమ్మవార్ల దర్శనం చేయించాలని డిమాండ్‌ చేయ గా.. విధిలేక అధికారులు సర్కిల్‌ దగ్గర ఉన్న ద్వారాన్ని తెరిచారు. లోనికి వెళ్లిన హిజ్రాలు.. గద్దెల వద్దకు వెళ్లే ప్రధాన ద్వారం సైతం తెరవాలని పట్టుపట్టారు. హిజ్రాలతోపాటు ఇతర భక్తులు కూడా అదే ద్వారం నుంచి పెద్ద ఎత్తున రావడంతో తెరవడానికి నిరాకరించారు. దీంతో అసహనానికి గురైన హిజ్రాలు ప్రధాన ద్వారాన్ని అటూ ఇటూ ఊపుతూ పూర్తిగా తొలగించారు. పోలీసులు ఏమీ చేయలేక మిన్నకుండి పోయా రు. తొలగించిన ద్వారం నుంచి అందరూ ఒకేసారి లోనికి ప్రవేశించడంతో తోపులాట జరిగింది. ఇదిలా ఉండగా ఉదయం కూడా హిజ్రాలు, సాధారణ భక్తుల మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. ఇద్దరు చిన్న పిల్లలు గాయపడి అస్వస్థతకు గురయ్యారు.

whatsapp channel

మరిన్ని వార్తలు