స్టార్టప్‌లకు ప్రభుత్వ ప్రోత్సాహం

6 Mar, 2023 04:26 IST|Sakshi
కార్యక్రమంలో మాట్లాడుతున్న టీఎస్‌ఐసీ చీఫ్‌ ఇన్నోవేషన్‌ ఆఫీసర్‌ శాంతా తౌతం

రాయదుర్గం: తెలంగాణ రాష్ట్రాన్ని 33 జిల్లాల స్టార్టప్‌ క్యాపిటల్‌గా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని టీఎస్‌ఐసీ చీఫ్‌ ఇన్నోవేషన్‌ ఆఫీసర్‌ శాంతా తౌతం పేర్కొన్నారు. హెచ్‌సీయూలో ఎస్పైర్‌ సహకారంతో ది ఎంటర్‌ప్రెన్యూర్‌ జోన్‌(టీఈజెడ్‌)వారి ఉమ్మడి–స్టార్టప్‌ లాంచర్‌ ప్రోగ్రామ్‌లో పట్టభద్రులైన వారి స్టార్టప్‌ల ధృవీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ స్టార్టప్‌ కల్చర్‌ను అంతటా అభివృద్ధి చేసేందుకు, వినూత్న పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా 45 మంది స్టార్టప్‌ వ్యవస్థాపకులకు సర్టిఫికెట్లు అందజేశారు.

మరిన్ని వార్తలు