సాక్షి, సిటీబ్యూరో: .....

26 May, 2023 04:54 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: బాచుపల్లి, మేడిపల్లిలో ప్లాట్లకు హెచ్‌ఎండీఏ రెండోదశ నిర్వహించిన ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ ద్వారా రూ.260.29 కోట్ల ఆదాయం లభించింది. బాచుపల్లిలో 133 ప్లాట్లు, మేడిపల్లిలో 85 ప్లాట్లకు ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ నిర్వహించారు. మొత్తం 67,894.23 చదరపు గజాల స్థలాల్లో బాచుపల్లిలో 131 ప్లాట్లు (37497.41చదరపు గజాలు), మేడిపల్లిలో 78 ప్లాట్లు (27,421) అమ్ముడయ్యాయి. రెండు చోట్ల కలిపి 64918.41 చదరపు గజాలను విక్రయించినట్లు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. ఈ ప్లాట్లపై దాదాపు రూ.189.88 కోట్ల ఆదాయం లభించవచ్చని అంచనా వేయగా అనూహ్యంగా రూ.260.29 కోట్లు వచ్చాయని చెప్పారు. బాచుపల్లిలో చదరపు గజానికి అత్యధికంగా రూ.53,500 వరకు లభించింది. మేడిపల్లిలో అత్యధికంగా రూ.50 వేలు లభించింది. బాచుపల్లిలో గజానికి రూ.25 వేలు చొప్పున నిర్ణీత ధర నిర్ణయించగా గజానికి రూ.39,674 చొప్పున ఆన్‌లైన్‌లో అమ్మకాలు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. మేడిపల్లిలో గజానికి నిర్ణీత ధర రూ.32 వేల చొప్పున నిర్ణయించగా సగటున గజానికి రూ.40 ,668 చొప్పున ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌లో లభించింది. బాచుపల్లిలో రూ.148.77 కోట్లు, మేడిపల్లిలో రూ.111.52 కోట్ల చొప్పున మొత్తం రూ.260.29 కోట్ల ఆదాయం లభించింది.

మరిన్ని వార్తలు