గూడు కట్టిన ‘కరుణ’

6 Aug, 2023 09:00 IST|Sakshi

బంజారాహిల్స్‌: పేదింటికి పెన్నిధిలా మారారు ఆయన. తనకొచ్చిన కష్టాన్ని వివరించేందుకు వచ్చిన దీనురాలికి సాయం అందించి తోడుగా నిలిచారు ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి. వివరాలు ఇలా ఉన్నాయి.. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌– 10లో నివసించే 70 ఏళ్ల ఉన్నిసా బేగం భర్త మూడు దశాబ్దాల క్రితం మృతి చెందారు.

ఇద్దరు కుమార్తెలకు వివాహాలయ్యాయి. తాను ఉంటున్న ఇంటిని ఉన్నిసా బేగం దాచుకున్న డబ్బుతో గత ఏడాది బాగు చేయించుకుంది. ఇటీవల కురిసిన వర్షాలతో ఇల్లు ఉరుస్తుండటంతో.. మేస్త్రి సరిగా రిపేరు చేయలేదని ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లింది. వృద్ధురాలి బాధను విన్న ఎస్‌ఐ కరుణాకర్‌ రెడ్డి నేరుగా ఆమె ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఇంటికి అవసరమైన కొత్త సిమెంట్‌ రేకులను తన సొంత డబ్బుతో అందించారు. ఎస్‌ఐ ఔదార్యాన్ని స్థానికులు అభినందించారు. 

మరిన్ని వార్తలు