అపార్ట్‌మెంట్‌లో కొండచిలువ కలకలం..!

8 Sep, 2023 09:41 IST|Sakshi

హైదరాబాద్‌: ఓ అపార్ట్‌మెంట్‌లోకి కొండ చిలువ ప్రవేశించడంతో స్థానికంగా కలకలం రేపింది. నిజాంపేట్‌ కార్పొరేషన్‌ ప్రగతినగర్‌లోని సాయి ఎలైట్‌ అపార్ట్‌లోని పార్కింగ్‌ ప్రదేశంలోకి కొండ చిలువ ప్రవేశించడంతో అపార్ట్‌మెంట్‌ వాసులు భయబ్రాంతులకు లోనయ్యారు.

ఫ్రెండ్స్‌ స్నేక్‌ సొసైటీ సభ్యుడు అంకిత్‌ శర్మకు ఫోన్‌ చేయడంతో వెంటనే అపార్ట్‌మెంట్‌ వద్దకు చేరుకుని చాకచక్యంగా కొండచిలువను పట్టుకున్నాడు. తన వెంట తెచ్చిన బ్యాగ్‌లో కొండ చిలువను తీసుకుని సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలి పెట్టాడు. ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వరద నీటితో కొండ చిలువ కొట్టుకుని వచ్చి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు