వెల్లివిరిసిన ‘జాతీయ సమైక్యత’

18 Sep, 2023 06:42 IST|Sakshi
జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో..

సాక్షి, సిటీబ్యూరో: జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఘనంగా జరిగాయి. అమీర్‌పేట్‌లోని హెచ్‌ఎండీఏ కార్యాలయంలో సెక్రెటరీ పి.చంద్రయ్య జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. హెచ్‌ఎండీఏ అర్బన్‌ ఫారెస్ట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.ప్రభాకర్‌, ప్లానింగ్‌ డైరెక్టర్లు విద్యాధర్‌, శ్రీనివాస్‌, చీఫ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ విజయలక్ష్మి, ల్యాండ్‌ పూలింగ్‌ ఆఫీసర్‌ ప్రసూనాంబ పాల్గొన్నారు.

ఆర్టీసీలో..

ఆర్టీసీ బస్‌భవన్‌లో జరిగిన వేడుకలలో ఎండీ సజ్జనార్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. భూమికోసం, భుక్తికోసం, పీడిత ప్రజల విముక్తి కోసం నాడు సాగించిన ప్రజా సాయుధ పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల ఆశయాలను, నాటి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ డా.రవిందర్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎస్‌.కృష్ణకాంత్‌, కార్యదర్శి మునిశేఖర్‌, జాయింట్‌ డైరెక్టర్‌ సంగ్రామ్‌ సింగ్‌ జి.పాటిల్‌ తదితరులు పాల్గొన్నారు.

మెట్రో భవన్‌లో..

బేగంపేట్‌లోని హైదరాబాద్‌ మెట్రో రైల్‌ భవన్‌లో జరిగిన వేడుకల్లో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.

జీహెచ్‌ఎంసీలో...

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్‌ విజయలక్ష్మి జాతీయపతాకాన్ని ఎగురవేసి వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్‌ 17వ తేదీకి ఒక ప్రత్యేకత ఉందన్నారు. రాచరిక పరిపాలన ముగిసిపోయి పార్లమెంటరీ ప్రజాస్వామ్య పరిపాలన ప్రారంభమైందని తెలిపారు. హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో అంతర్భాగంగా మారిన ఈ సందర్భాన్ని తెలంగాణ ప్రభుత్వం జాతీయ సమైక్యతా దినోత్సవంగా పరిగణిస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌, ఆయా విభాగాల ఉన్నతాధికారులు ప్రకాశ్‌రెడ్డి, జియావుద్దీన్‌, దేవానంద్‌, రాజేంద్రప్రసాద్‌ నాయక్‌, అడిషనల్‌ కమిషనర్లు శంకరయ్య, కృష్ణ,ఉపేందర్‌రెడ్డి, గీతామాధురి, ఎండి బాషా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు