బోరబండలో ఉద్రిక్తత

23 Sep, 2023 06:22 IST|Sakshi
నిందితుడిని రిమాండ్‌కు తరలిస్తున్న పోలీసులు

పరిస్థితిని సమీక్షించిన డీసీపీ, ఏసీపీలు

బ్రాహ్మణవాడిలో పోలీస్‌ పికెట్‌

రహమత్‌నగర్‌: బాలుడిపై లైంగిక దాడి ఘటన నేపథ్యంలో బోరబండ పోలీస్‌ స్టేషన్‌ వద్ద గురువారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాధిత బాలుడి కుటుంబ సభ్యులు, బస్తీవాసులు బ్రాహ్మణవాడిలోని నిందితుడి కిరాణ దుకాణాన్ని ధ్వంసం చేశారు. అనంతరం వారు పెద్ద సంఖ్యలో ఠాణా వద్దకు చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెస్ట్‌ జోన్‌ డీసీపీ జోయల్‌ డెవీస్‌, ఏపీసీ వెంకటేశ్వర్‌రావు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. బాధితుల ఆందోళనకు పలు పార్టీల నాయకులు మద్దతుగా నిలిచారు. దీంతో బ్రాహ్మణవాడి బస్తీలో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు. బీజేపీ జాతీయ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు డాక్టర్‌ వీరపనేని పద్మ మాట్లాడుతూ నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. నిందితునిపై ఫోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసినట్లు డీసీపీ జోయల్‌ డెవీస్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు