లారీని ఓవర్‌ టేక్‌ చేస్తూ.. ఇంజినీరింగ్‌ విద్యార్థి దుర్మరణం

26 Sep, 2023 07:41 IST|Sakshi

హైదరాబాద్: బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు డీసీఎంను ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో అదుపుతప్పి కింద పడిపోవడంతో వెనక నుంచి వచ్చిన టిప్పర్‌ వారి మీదుగా వెళ్లడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సూరారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కై సర్‌ నగర్‌లో చోటుచేసుకుంది. సీఐ వెంకటేశ్వరరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దుండిగల్‌ ఐఏఆర్‌ఈ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న పవన్‌ ( 21), మణిదీప్‌ (20) మల్లంపేటలో నివాసం ఉంటున్నారు.

సోమవారం కాలేజీకి వెళ్లి తిరిగి వస్తున్న వీరు కై సర్‌ నగర్‌ సమీపంలో ముందు వెళుతున్న డీసీఎంను ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో అదుపు తప్పి కింద పడ్డారు. అదే సమయంలో వెనక నుంచి వచ్చిన టిప్పర్‌ వీరిపై నుండి వెళ్లడంతో తీవ్ర గాయాలైన పవన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

సమాచారం అందుకున్న పోలీసులు మణిదీప్‌ను ఆసుపత్రికి తరలించారు. మృతుడు పవన్‌ జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలం, బూరుగుపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు