‘ఫ్లెక్సీ ప్రింటర్లను’ ప్రభుత్వం ఆదుకోవాలి

30 Oct, 2023 05:02 IST|Sakshi
డైరీని ఆవిష్కరిస్తున్న ప్రొఫెసర్‌ కోదండరామ్‌

నాంపల్లి: తెలంగాణ ఫ్లెక్స్‌ ప్రింటర్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఏడవ వార్షికోత్సవం ఆదివారం రెడ్‌హిల్స్‌లోని ఫెడరేషన్‌ హౌస్‌లోని కేఎల్‌ఎన్‌ ప్రసాద్‌ ఆడిటోరియంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం హాజరయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ డైరీని ఆవిష్కరించి ప్రసంగించారు. ఫ్లెక్స్‌ ప్రింటర్స్‌ను ఆదుకోవడానికి ప్రభుత్వం కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. ఫ్లెక్సీలను నిషేధిస్తామని ప్రభుత్వం ప్రకటించడం దారుణం అన్నా రు. తెలంగాణ ఫ్లెక్స్‌ ప్రింటర్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్‌ అన్సారీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫ్లెక్సీలను నిషేధిస్తామంటూ ప్రకటించి ప్రింటర్స్‌ యాజమానులను, ఫ్లెక్సి ప్రింటింగ్‌పై ఆధారపడి జీవించే లక్షలాది కుటుంబాలను ఆందోళనకు గురిచేసిందని అన్నారు. ప్రభుత్వం నుంచి తాము ఎలాంటి రాయితీలు కోరుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో ఏపీ ఫ్లెక్స్‌ ప్రింటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు