జిల్లా కలెక్టర్‌కు ‘కరపత్రాల’ అందజేత

30 Oct, 2023 05:02 IST|Sakshi

బంజారాహిల్స్‌: ఓటింగ్‌ శాతం పెంచేందుకు ఎన్నికల అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు, ప్రౌడ్‌ టు బీ ఏ ఓటర్‌ అనే స్టిక్కర్లు అతికిస్తున్నారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గం బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 13లోని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌, జిల్లా ఉప ఎన్నికల అధికారి అనుదీప్‌ దురిశెట్టి నివాసానికి స్థానిక బీఎల్‌ఓలు వెళ్లి ఇంటికి స్టిక్కర్‌ అతికించి కరపత్రాలు అందజేశారు. ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.

మరిన్ని వార్తలు