జంపింగ్‌ జపాంగ్‌

4 Nov, 2023 04:36 IST|Sakshi

ఖైరతాబాద్‌ నియోజకవర్గంలోని హిమాయత్‌నగర్‌ డివిజన్‌ బీజేపీ కార్పొరేటర్‌ గడ్డం మహాలక్ష్మి, ఆమె భర్త, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామన్‌ గౌడ్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం నారాయణగూడలోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. కన్నతల్లి లాంటి పార్టీకి ఓ వ్యక్తి వల్ల రాజీనామా చేయాల్సి వచ్చిందని దంపతులిద్దరూ కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం కార్పొరేటర్‌ దంపతులు మహాలక్ష్మి, రామన్‌గౌడ్‌ డివిజన్‌ నాయకులు, అనుచరులతో కలిసి తెలంగాణ భవన్‌కి వెళ్లి మంత్రి కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌ ఆధ్వర్యంలో కేటీఆర్‌ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. – హిమాయత్‌నగర్‌

మరిన్ని వార్తలు