కాంగ్రెస్‌ గూటికి బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌

14 Nov, 2023 04:32 IST|Sakshi

రహమత్‌నగర్‌: పండగపూట జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి షాక్‌ తగిలింది. రహమత్‌నగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ సీఎన్‌ రెడ్డి కాంగ్రెస్‌ గూటికి చేరారు. కార్పొరేటర్‌ సీఎన్‌ రెడ్డి తన అనుచరులతో కలిసి ఆదివారం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మహమ్మద్‌ అజహరుద్దీన్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు చేస్తున్న అవమానాలను భరించలేకనే తాను కన్న తల్లిలాంటి పార్టీని వీడాల్సి వచ్చిందన్నారు. మనస్సాక్షిని చంపుకొని విలువల్లేని పార్టీలో తాను ఉండలేనని వాపోయారు. బీఆర్‌ఎప్‌ పార్టీలో ప్రజాస్వామ్యం లేదని, అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు