ప్రధాన పార్టీల తప్పుడు అఫిడవిట్లు

14 Nov, 2023 04:32 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న నవీన్‌యాదవ్‌

శ్రీనగర్‌కాలనీ: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు తప్పుడు అఫిడవిట్లు సమర్పించి ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని, రిటర్నింగ్‌ ఆఫీసర్‌ తప్పులు ఉన్నా వాటిని స్వీకరించడం ఎంతవరకు సబబని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్‌ యాదవ్‌ ప్రశ్నించారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... సోమవారం నామినేషన్ల పరిశీలనలో భాగంగా జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి గోపీనాథ్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి అజహరుద్దీన్‌లు ఫాం–26లో కొన్ని విషయాలను తప్పుగా పొందుపరచారన్నారు. మరికొన్ని చోట్ల బ్లాంక్‌గా పెట్టారని అన్నారు. తప్పుగా అఫిడవిట్‌ను దాఖలు చేస్తే ఎందుకు ఆమోదించారని ప్రశ్నించారు. ఈ విషయంపై ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు