-

నిమ్స్‌లో ఊపిరితిత్తుల కేన్సర్‌పై అవగాహన

28 Nov, 2023 04:54 IST|Sakshi

లక్డీకాపూల్‌: ఊపిరితిత్తుల కేన్సర్‌ బాధితులకు నిమ్స్‌ యాజమాన్యం భరోసా కల్పిస్తుందని ఆస్పత్రి సంచాలకులు ప్రొఫెసర్‌ నగరి బీరప్ప స్పష్టం చేశారు. లంగ్‌ కేన్సర్‌ వస్తే చాలా మంది ప్రాణాల మీద ఆశలు వదులేసుకుంటున్నారని చెప్పారు. కానీ నిమ్స్‌ అందిస్తున్న వైద్య సేవలతో ఎక్కువ కాలం జీవిస్తున్నారని చెప్పారు. సోమవారం నిమ్స్‌ ట్రామా బ్లాక్‌ ఆడిటోరియంలో మెడికల్‌ ఆంకాలజీ విభాగం ఆధ్వర్యంలో లంగ్‌ కేన్సర్‌ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్‌ మాట్లాడుతూ.. ఆస్పత్రిలో ప్రతి 100 మంది ఊపిరితిత్తి కేన్సర్‌ బాధితుల్లో 20 మంది వరకు ఎక్కువ కాలం జీవించేలా సేవలదిస్తున్నామన్నారు. నిమ్స్‌ మెడికల్‌ ఆంకాలజీ విభాగం అధిపతి డాక్టర్‌ సదాశివుడు, ఎగ్జిక్యూటివ్‌ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ శాంతివీర్‌, అసోసియేట్‌ డీన్‌లు డాక్టర్‌ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఎంఈడీ, ఎంపీఈడీ చివరి జాబితా విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ: ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల్లో సీట్లు సాధించిన విద్యార్థుల చివరి జాబితాను విడుదల చేశారు. టీఎస్‌సీపీజీఈటీ–2023 ప్రవేశాలలో భాగంగా 2వ, చివరి విడతలకు జరిగిన కౌన్సెలింగ్‌కు 609 మంది హాజరుకాగా 209కి సీట్లు కేటాయించినట్లు కన్వీనర్‌ ప్రొ.పాండురంగారెడ్డి పేర్కొన్నారు. సీట్లు సాధించిన విద్యార్థులు టీసీతో పాటు ఇతర ఒరిజినల్‌ సర్టిఫికెట్లను డిసెంబర్‌ 1 వరకు కాలేజీల్లో రిపోర్టు చేయాలన్నారు.

మరిన్ని వార్తలు