యువతా.. నీదే భవితా..

30 Nov, 2023 04:46 IST|Sakshi

గ్రేటర్‌ యువత ఉదాసీనత వీడాలి. బాధ్యతాయుతంగా వ్యవహరించి ఓటు వేసేందుకు ముందుకు రావాలి. తమ భవితను తీర్చిదిద్దుకునేందుకు ఇదే సరైన సమయం. ఓటుతో తమకేం కావాలో పాలకులకు తెలియజెప్పాలి. ఈ ఏడాది కొత్తగా ఓటు హక్కును పొందిన యువతీ యువకులు లక్షల్లోనే ఉన్నారు. ఉప్పల్‌,మల్కాజిగిరి, మేడ్చల్‌, ఎల్‌బీనగర్‌, తదితర నియోకవర్గాల్లో కొత్త ఓటర్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అన్ని వర్గాలకు చెందిన ఓటర్లు బాధ్యతగా ఓటు వేస్తే నగరంలో ఈసారి ఓటింగ్‌ శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. పార్టీల ఎన్నికల ప్రచారంలో యువకులు పెద్ద సంఖ్యలోనే పాల్గొన్నారు. ఓటింగ్‌లో కూడా అదేవిధమైన బాధ్యతను కొనసాగించాలి. కోటిన్నర జనాభా ఉన్న గ్రేటర్‌ హైదరాబాద్‌లో పోలింగ్‌ కనీసం 70 శాతం దాటాలంటే యువత బాధ్యతాయుతంగా ఓటేయాలి.

మరిన్ని వార్తలు