డ్రోన్లతో పరిశీలన

1 Dec, 2023 07:22 IST|Sakshi

అభ్యర్థుల్లో అంతర్మథనం

హోరాహోరీగా ఎన్నికల పోరులో తలపడిన అభ్యర్థుల్లో అంతర్మథనం మొదలైంది. ఎన్నికల అనంతరం గురువారం వెల్లడైన పలు ఎగ్జిట్‌ పోల్‌, ప్రీపోల్‌ సర్వేలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ క్రమంలో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు గెలుపోటములపై సమీక్షంచుకుంటున్నారు. రాజకీయ పార్టీలతో పాటు సాధారణ ప్రజల్లోనూ ఎన్నికల ఫలితాలపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. గ్రేటర్‌లో అన్ని పార్టీలు విస్తృతమైన ప్రచారం చేపట్టినప్పటికీ ఓటింగ్‌ శాతం తక్కువగా నమోదైంది. సొంతూరిలో ఓటేసేందుకు లక్షలాది మంది నగరం వెళ్లారు. దీంతో ఆయా కాలనీలు, బస్తీలపై బలమైన నమ్మకం ఏర్పర్చుకున్న అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. నియోజకవర్గంలోని ఒక్కో పోలింగ్‌ బూత్‌లో నమోదైన ఓట్లను అంచనా వేస్తున్నారు.

నగరంలో ఈసారి ఎన్నికలు సవ్యంగా నిర్వహించేందుకు అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాట్లు చేయడంతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలతోపాటు సున్నిత ప్రాంతాల్లో డ్రోన్‌ కెమెరాలను సైతం వినియోగించారు. నాంపల్లి నియోజకవర్గంలో పోలింగ్‌ కేంద్రాల పరిశీలనకు డ్రోన్‌ కెమెరాలను వినియోగించారు.

ప్రశాంత ఎన్నికలకు సహకరించారు..

హైదరాబాద్‌ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఓటర్లు సహకరించారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు కృషి చేసిన పోలీస్‌, జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది, మీడియా, పోలింగ్‌లో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు.

– రోనాల్డ్‌ రాస్‌, హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి

మరిన్ని వార్తలు