ప్రాధాన్యతాక్రమంలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం

27 Feb, 2024 08:00 IST|Sakshi
ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరిస్తున్న దృశ్యం

సాక్షి,సిటీబ్యూరో: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును ప్రాధాన్యత క్రమంలో త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. వివిధ శాఖల జిల్లా అధికారులు, మండలాల తహసీల్దార్లతో మాట్లాడుతూ వారి పరిధిలోకి వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో 132 అర్జీలు రాగా 117 గృహ నిర్మాణ శాఖకు, 15 ఇతర శాఖలకు సంబంధించి దరఖాస్తులు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో,ఆర్డీవోలు, తహసీల్దార్లు సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు

పొదుపు అలవాటు చేసుకోవాలి

ప్రతి ఒక్కరూ పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి అన్నారు. సోమవా రం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌హాల్‌లో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భ ంగా మాట్లాడుతూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆర్థిక అక్షరాస్యత వారాన్ని పాటిస్తుందని తెలిపారు. పొదుపు అవశ్యకతను తెలియజేస్తూ, సైబర్‌ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ రోహిణి, ఎల్‌డీఎం జీఎం సుబ్రహ్మణ్యం, ఎఎల్డీఎం ప్రదీప్‌ సింగ్‌, వివిధ బ్యాంకుల సిబ్బంది పాల్గొన్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు