శాంతియుత ఆందోళనలపై అణచివేతలా?

27 Feb, 2024 08:00 IST|Sakshi
నిరసన తెలుపుతున్న నారాయణ, చాడా వెంకట్‌రెడ్డి

కేంద్రంపై మండిపడ్డ సీపీఐ నేత నారాయణ

కవాడిగూడ: పంటకు కనీసం మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై మోదీ ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. ఈ మేరకు సోమవారం లోయర్‌ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద భారీ నిరసన చేపట్టారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు పశ్య పద్మ, కె.ఽశంకర్‌, ఎన్‌.బాల మల్లేశ్‌, ఈటీ నర్సింహ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. రైతుల ఆందోళనలు అణచి వేసేందుకు మోదీ ప్రభుత్వం పోలీసులతో దాడులు చేయిస్తోందన్నారు. అనంతరం సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులను తీవ్రంగా నష్టపరిచే వ్యవసాయ చట్టాలను తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కార్యక్రమంలో సీపీఐ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌.చాయాదేవి, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పి.జంగయ్య, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవీంద్రచారి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి జి.వెంకటేశం, సీపీఐ రాష్ట్ర నాయకులు స్టాలిన్‌, కె.యాదగిరి, శ్రీకాంత్‌, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్టా లక్ష్మణ్‌, మేడ్చల్‌ జిల్లా నేతలు జె.లక్ష్మ, ఉమామహేశ్‌ పాల్గొన్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు