శ్రీ చైతన్యలో విజయవంతంగా టెడ్‌ ఎక్స్‌

29 Feb, 2024 19:46 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: సృజనాత్మాక ఆలోచనలకు, భావితరాల నాయకత్వానికి నిలువుటద్దంలా నిలిచే ప్రతిష్టాత్మక టెడ్‌ ఎక్స్‌ వేదికపై చిన్నారులు పంచుకున్న ఆలోచనలు అందరినీ అబ్బురపరిచాయి. మియాపూర్‌లోని శ్రీ చైతన్య ఫ్యూచర్‌ పాత్‌వేస్‌ క్యాంపస్‌లో టెడ్‌ ఎక్స్‌ నిర్వహించారు. 6 నుంచి 8వ తరగతికి చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని పలు అంశాలపై తమదైన శైలిలో మాట్లాడారు. భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలు, ప్రపంచ దేశాల్లో భారత్‌ దేశ పాత్ర తదితర అంశాలపై నిశితమైన భావనతో విద్యార్థులు ప్రసంగించారు. ప్రిన్సిపాల్‌ భావన పాథక్‌, శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్‌ సీమ బొప్పన, చీప్‌ అకాడమిక్‌ ఆఫీసర్‌ పుష్పవల్లి తదితరులు పాల్గొన్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు