విచారణ జరిపించాలి

29 Feb, 2024 19:46 IST|Sakshi
హౌసింగ్‌ సొసైటీ అక్రమాలపై
కో ఆపరేటివ్‌ డైరెక్టర్‌కు సొసైటీ సభ్యుల ఫిర్యాదు

సాక్షి, సిటీబ్యూరో: భాగ్యనగర్‌ టీఎన్జీవోస్‌ మ్యుచువల్లి ఎయిడెడ్‌ కో– ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని పలువురు సభ్యులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌ గృహకల్ప కాంప్లెక్స్‌ లోని సహకార శాఖ కార్యాలయంలో సొసైటీ సభ్యుల ప్రతినిధి బృందం కో– ఆపరేటివ్‌ డైరెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సొసైటీలో రూ. కోట్ల నిధులు దుర్వినియోగమయ్యాయని ఆరోపించారు. 2008లో లబ్దిదారుల జాబితాను ఆమోదించి విడుదల చేసినప్పటికీ, సొసైటీ పేరును రూల్స్‌ కు వ్యతిరేకంగా మార్పు చేసి అర్హతలేని పంచాయతీ కార్యదర్శులు, మార్కెట్‌ యార్డుల్లో పనిచేసే ఉద్యోగులు, జిల్లాల్లోని ఉద్యోగులనుంచి రూ. కోట్లు వసూలు చేసి ఎలాంటి రసీదులు ఇవ్వకుండా సభ్యత్వం ఇచ్చారన్నారు. సొసైటీ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్‌, సెక్రెటరీ మల్లారెడ్డి, కోశాధికారి శ్రీనివాస్‌, కమిటీ సభ్యులు కొందరు కుమ్మకై ్క భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ల్యాండ్‌ ప్రభు త్వ అధీనంలో ఉన్నప్పటికీ అసత్య ప్రచా రం చేస్తూ డబ్బులు వసూలు చేశారన్నారు. తెలంగాణ మ్యాక్స్‌ యాక్ట్‌, 1995 లోని సెక్షన్‌ 29 ప్రకారం ఆర్థిక అవకతవకలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, విచారణ పూర్తయ్యేవరకు సొసైటీ నిధులను ప్రస్తుత మేనేజింగ్‌ కమిటీ డ్రా చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని వారు డైరెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. డైరెక్టర్‌ను కలిసిన వారిలో పాండురంగారావు, నరసింగరావు, వెంకటేశ్వర రావు, ప్రసాద రావు, మహేష్‌ కుమార్‌, ధన్‌రాజ్‌ , సి శ్రీనివాస రావు, హేమలత, కొఆపరేటివ్‌ నాగార్జున్‌, వేంకటేశ్వర రావు ఉన్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు