హైదరాబాద్‌ అదనపు కలెక్టర్‌గా హేమంత కేశవ్‌ పాటిల్‌

29 Feb, 2024 19:48 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ)గా హేమంత కేశవ్‌ పాటిల్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా హైదరాబాద్‌ స్పెషల్‌ ఎస్‌పీఎంగా డిప్యూటీ కలెక్టర్‌ కె.జ్యోతికి పోస్టింగ్‌ లభించగా, ఇక్కడ పనిచేస్తున్న కొమరయ్య జనగామ ఆర్డీవోగా బదిలీ అయ్యారు.

జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ బదిలీ

జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ (రెవెన్యూ, ఐటీ) స్నేహ శబరీష్‌ బదిలీ అయ్యారు. ఐఏఎస్‌ల బదిలీల్లో భాగంగా ఆమెను కుమరం భీమ్‌–ఆసిఫాబాద్‌ కలెక్టర్‌గా బదిలీ చేశారు. ఆ జిల్లా కలెక్టర్‌ భోర్కడే హేమంత్‌ సహదేవ్‌రావ్‌ను జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌గా నియమించారు.

whatsapp channel

మరిన్ని వార్తలు