సిటీలో బదిలీ అయిన లా అండ్‌ ఆర్డర్‌, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు

3 Mar, 2024 09:20 IST|Sakshi
డైరీని ఆవిష్కరిస్తున్న ప్రొఫెసర్‌ కోదండరామ్‌

పేరు ప్రస్తుత పోస్టింగ్‌ బదిలీ అయిన స్థానం

ఆర్‌ రఘునాథ్‌ సీసీఎస్‌ బహదూర్‌పుర పీఎస్‌

ఎస్‌ శ్రీనివాసచారి సైబర్‌ క్రైమ్‌ సుల్తాన్‌ బజార్‌ పీఎస్‌

పీ లక్ష్మికాంత్‌ రెడ్డి డీఐ బహదూర్‌పుర కాచిగూడ

షేక్‌ జాకీర్‌ హుస్సేన్‌ డీఐ, బంజారాహిల్స్‌ టాస్క్‌ఫోర్స్‌

కే రఘుకుమార్‌ డీఐ, చాంద్రయాణగుట్ట లంగర్‌హౌస్‌ పీఎస్‌

ఎస్‌ బాలస్వామి డీఐ, చార్మినార్‌ టాస్క్‌ఫోర్స్‌

ఎస్‌ వీర శంకర్‌ డీఐ, జూబ్లిహిల్స్‌ బోరంబండ పీఎస్‌

జీ లింగేశ్వర్‌ రావు డీఐ, ఖైరతాబాద్‌ అఫ్జల్‌గంజ్‌ పీఎస్‌

వెంకట్‌ రెడ్డి డీఐ, ముషీరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌

నాగార్జున డీఐ, సైఫాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌

ఎన్‌ రామకృష్ణ డీఐ, సెక్రటేరియట్‌ టాస్క్‌ఫోర్స్‌

టీ శ్రీనాథ్‌ రెడ్డి ఎస్‌బీ ఎస్‌ఆర్‌నగర్‌ పీఎస్‌

ఆదిరెడ్డి బోరబండ, పీఎస్‌ ఫలక్‌నుమా, పీఎస్‌

రామకృష్ణ మల్టీజోన్‌–2 కార్కానా, పీఎస్‌

రాజగోపాల్‌ రెడ్డి మల్టీజోన్‌–2 అబిడ్స్‌, పీఎస్‌

టీ నర్సింగ్‌రావు చార్మినార్‌, ట్రాఫిక్‌ పీఎస్‌ రాంగోపాల్‌పేట, పీఎస్‌

జీ విజయ్‌ కుమార్‌ మల్టీజోన్‌–2 బేగంబజార్‌, పీఎస్‌

సైదులు మల్టీజోన్‌–2 గోల్కొండ పీఎస్‌

రాఘవేందర్‌ మల్టీజోన్‌–2 మార్కెట్‌ పీఎస్‌

నర్సింహారెడ్డి మల్టీజోన్‌–2 ఓయూ సిటీ, పీఎస్‌

మధుసూదన్‌ రెడ్డి మల్టీజోన్‌–2 మధురానగర్‌, పీఎస్‌

రామస్వామి మల్టీజోన్‌–2 కుల్సుంపుర, పీఎస్‌

వీ ప్రదీప్‌ కుమార్‌ మల్టీజోన్‌–2 ఓయూ సిటీ

బాలస్వామి మల్టీజోన్‌–2 భవానీనగర్‌, పీఎస్‌

ప్రవీణ్‌ కుమార్‌ మల్టీజోన్‌–2 జూబ్లిహిల్స్‌, ట్రాఫిక్‌

ఆర్‌ గోపి మల్టీజోన్‌–2 కాలాపత్తర్‌, పీఎస్‌

పీఎన్‌డీ ప్రసాద్‌ మల్టీజోన్‌–2 మొఘల్‌పుర, పీఎస్‌

గోవర్ధనగిరి మల్టీజోన్‌–2 మాసబ్‌ట్యాంక్‌, పీఎస్‌

ఎం మహేశ్‌ మల్టీజోన్‌–2 మంగల్‌ఘాట్‌, పీఎస్‌

నిరంజన్‌ మల్టీజోన్‌–2 ముషీరాబాద్‌, పీఎస్‌

రఘువీర్‌ రెడ్డి మల్టీజోన్‌–2 సంతోష్‌నగర్‌, పీఎస్‌

టీ కిరణ్‌ కుమార్‌ మల్టీజోన్‌–2 నాంపల్లి, ట్రాఫిక్‌

సైదులు మల్టీజోన్‌–2 ఎస్‌ఆర్‌ నగర్‌, ట్రాఫిక్‌

జంగయ్య మల్టీజోన్‌–2 టాస్క్‌ఫోర్స్‌

బాలు చౌహాన్‌ మల్టీజోన్‌–2 షాహినాత్‌ఘంజ్‌ పీఎస్‌

సాయి ప్రకాష్‌ గౌడ్‌ మల్టీజోన్‌–2 బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌

ఎస్‌ రవికుమార్‌ మల్టీజోన్‌–2 శాలిబండ, పీఎస్‌

రాములు మల్టీజోన్‌–2 టప్పచాబుత్రా పీఎస్‌

శ్రీను మల్టీజోన్‌–2 దబీర్‌పుర పీఎస్‌

సురేందర్‌ మల్టీజోన్‌–2 చార్మినార్‌ ట్రాఫిక్‌

శ్రీనివాస్‌ రెడ్డి మొఘల్‌పుర, పీఎస్‌ ఛత్రినాకా, పీఎస్‌

రాజ్యాంగాన్ని తీసి వేయాలని కుట్ర చేస్తున్నారు

సుందరయ్య విజ్ఞాన కేంద్రం: రాజ్యాంగం వల్లే మనకు ఇచ్చి హక్కులు దక్కాయని ఆ రాజ్యాంగాన్నే తీసి వేయాలని నేటి పాలకులు కుట్ర చేస్తున్నారని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్‌ కోదండరామ్‌ మాట్లాడుతూ మనకు ఆత్మగౌరవం దక్కిందే ఈ రాజ్యాంగం వల్ల అని అలాంటి రాజ్యాంగాన్ని చదవాలని పాలకులకు చెప్పాల్సి వస్తోందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. విద్యుత్‌ సంస్థలో పని చేస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ కమీషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ జీవోలు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలు చేయని విషయాలు తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులకు నోటీసులు ఇచ్చి పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమీషన్‌ సభ్యులు కొంకటి లక్ష్మినారాయణ, తెలంగాణ ఎలక్ట్రిక్‌సిటీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు అరెల్లి మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

గ్రామీణ జాతరల పద నిఘంటువు పుస్తకావిష్కరణ

గన్‌ఫౌండ్రీ: తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామం చూసినా ఇంటి, వన, గ్రామ దేవతలకు కొదవలేదని ఆయా జాతర సందర్భాలలో ప్రజలు మాట్లాడే భాషకు అర్థాలను తెలియజేస్తూ పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్య అన్నారు. ఈ మేరకు శనివారం రవీంద్రభారతిలోని పర్యాటక శాఖ కార్యాలయంలో తెలంగాణ సాహిత్య అకాడమి ముద్రించిన తెలంగాణ సాంస్కృతిక పదకోశం, పండుగలు, జాతరల పద నిఘంటువు పుస్తకాన్ని ఆవిస్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... సాంస్కృతిక పద సంపదను భవిష్యత్‌ తరాలకు అందజేసేందుకు ఈ పుస్తకం ఎంతో ఉపయుక్తంగా ఉంట్టుందన్నారు. గ్రామీణ ప్రాంత జాతరలలో ఉపయోగించేటటువంటి వ్యవహరిక భాషను గ్రంథం రూపంలో తీసుకురావడాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ సంచాలకులు కె.నిఖిల, సాహిత్య అకాడమి కార్యదర్శి బాలచారి తదితరులు పాల్గొన్నారు.

నగరం నుంచి కీసరగుట్టకు 200 బస్సులు

కీసర: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా జంటనగరాల్లోని వివిధ ప్రాంతాలనుండి 200 ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ సికింద్రాబాద్‌ డివిజనల్‌ మేనేజర్‌ బీంరెడ్డి అన్నారు. శనివారం కీసరగుట్టలో బ్రహ్మోత్సవాల సందర్భంగా చేపడుతున్న ఏర్పాట్లను డిప్యూటీ రీజినల్‌ మేనేజర్‌ సురేష్‌ చౌహాన్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం డిపో మేనేజర్లతో సమీక్ష నిర్వహించారు. ఈనెల 6 నుండి 11వ తేదీ వరకు సికింద్రాబాద్‌ రీజన్‌ పరిధిలోని కుషాయిగూడ ,ఉప్పల్‌ చెంగిచెర ,హాకీంపేట్‌, రాణిగంజ్‌, కంటోన్‌మెంట్‌ డిపోల నుండి ఈ బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు.

గుర్తింపు పొందిన టూర్‌ ఆపరేటర్ల ద్వారానే హజ్‌ యాత్రకు వెళ్లాలి

సాక్షి సిటీబ్యూరో: కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన టూర్‌ ఆపరేటర్ల ద్వారానే హజ్‌ యాత్రకు వెళ్లాలని తెలంగాణ, హజ్‌, ఉమ్రా గ్రూప్‌ ఆర్గనైజరర్స్‌ అసొసియేషన్‌ ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌ రజాక్‌ ఖమర్‌ కోరారు. శనివారం గన్‌ఫౌండ్రీలో మీడియాతో మాట్లాడారు. మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రభుత్వం గుర్తింపు పొందిన ప్రైవేట్‌ టూర్‌ ఆపరేటర్ల 2024 హజ్‌ కోటాను విడుల చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 18 టూర్‌ ఆపరేటర్లకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. కేంద్ర హజ్‌ కమిటీ వెబ్‌సైట్‌లో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన టూర్‌ ఆపరేటర్ల లిస్టు ఉందని ఆన్‌లైన్‌ ద్వారా పరిశీలించాలన్నారు.

ప్రొఫెసర్‌ కోదండరామ్‌

whatsapp channel

మరిన్ని వార్తలు