63 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ

3 Mar, 2024 09:20 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: రానున్న లోకసభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో భారీ బదిలీలు జరిగాయి. 63 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేయగా.. ఇందులో 54 మంది అధికారులు స్థానికులు లేదా పార్లమెంటు నియోజకవర్గంలో మూడేళ్లు పనిచేస్తున్నవారు ఉన్నారు. వీరందరినీ మల్టీజోన్‌–2కు బదిలీ చేస్తూ కొత్వాల్‌ కే శ్రీనివాస రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వీరి స్థానంలో సైబరాబాద్‌, రాచకొండ, మల్టీజోన్‌–2 నుంచి 46 ఇన్‌స్పెక్టర్లను హైదరాబాద్‌ కమిషనరేట్‌కు బదిలీ చేశారు. వీరితో పాటు సిటీలో వివిధ ఠాణాలలో డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్లు (డీఐ)లుగా ఉన్న వారికి ఇన్‌స్పెక్టర్లుగా స్థాన చలనం కల్పించారు. దీంతో సుదీర్ఘకాలంగా డీఐలుగా పనిచేస్తున్న వారికి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌ఓ)గా అవకాశం లభించినట్లయింది. ఇదిలా ఉండగా.. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 41 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ కమిషనర్‌ అవినాష్‌ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు.

54 ఔట్‌.. 46 ఇన్‌!

స్థానికత, మూడేళ్లు మించిన ఇన్‌స్పెక్టర్లు బదిలీ

whatsapp channel

మరిన్ని వార్తలు