కొంపెల్ల మాధవీలత

3 Mar, 2024 09:25 IST|Sakshi

లోక్‌సభ స్థానం: హైదరాబాద్‌

స్వస్థలం: సంతోశ్‌నగర్‌

విద్యార్హత: పీజీ(పొలిటికల్‌ సైన్స్‌)

రాజకీయ నేపథ్యం: యాకుత్‌పురా నియోజకవర్గం సంతోశ్‌నగర్‌లో పుట్టి పెరిగారు మాధవీలత. భరతనాట్య నృత్యకారిణి ఆమె. ఆర్టిస్ట్‌, ఫిలాసఫర్‌, ఎంటప్రిన్యూర్‌ కూడా. 2001లో విరించి గ్రూఫ్‌ ఫౌండర్‌ కొంపెల్ల విశ్వనాథ్‌(ఈస్ట్‌ మారేడ్‌పల్లి)ను వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు సంతానం. విరించి ఆస్పత్రి సీఎండీగా పని చేస్తున్నారు. రెండేళ్లుగా పాతబస్తీ వేదికగా గోశాలతో పాటు భారీ యజ్ఞశాల ఏర్పాటు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిత్యం సంప్రదాయ చీరకట్టులో కనిపించే ఆమె.. ప్రధాని మోడీ ప్రసంగాలకు, పాలనకు ఆకర్షితులై బీజేపీలో చేరారు. తొలిసారిగా హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు