ఐటీ రంగం కావాలంటే మేము రావాలి : కేటీఆర్‌

24 Nov, 2020 17:31 IST|Sakshi

 150 స్థానాల్లో పోటీ చేస్తున్న ఏకైక పార్టీగా టీఆర్‌ఎస్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఐటీ రంగంలో భాగ్యనగరం బాగా రాణించాలంటే తమకే పట్టం కట్టాలని ఓటర్లను టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌  ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ కోరారు. హైదరాబాద్‌లో ఐటీ రంగం బాగా అభివృద్ధి చెందడంతో స్థానిక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా ఓ ఆసక్తికరమైన విషయం తెలియజేశారు. ఐటీ ఉద్యోగి గర్వపడేలా భాగ్యనగరంలో ఐటీ రంగం వృద్ధి రెట్టింపు వేగంతో జరుగుతోందని తెలిపారు. 2014 సంవత్సరంలో రూ. 57 వేల కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు ప్రస్తుతం లక్షా 29 వేల కోట్లకు చేరుకున్నట్లు ట్విటర్‌లో ప్రకటించారు. ప్రఖ్యాత సంస్థలు కోలువుదీరేలా  హైదరాబాద్‌  ఎదిగిందని కేటీఆర్‌ గుర్తు చేశారు. రాబోయే కాలంలో ఐటీ రంగం మరింత వృద్ధి సాధించాలంటే  డిసెంబర్‌ 1న కారు గుర్తుకు ఓటువేసి అభివృద్ధికి మద్ధతుగా నిలవాలని అభ్యర్థించారు. 

హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలలో 150 డివిజన్లకు గాను మొత్తం 1,122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి లోకేష్‌ కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. 150 స్థానాల్లో పోటీ చేస్తున్న ఏకైక పార్టీగా టీఆర్‌ఎస్‌ నిలిచింది. 149 స్థానాల్లో బీజేపీ బరిలో ఉంది. 146 స్థానాలలో కాంగ్రెస్‌ పోటి చేస్తుంది. సీపీఐ 17 స్థానాలు, సీపీఎం 12 స్థానాలలో, 51 ఎంఐఎం డివిజన్లలో అభ్యర్థలను రంగంలోదించారు.

మరిన్ని వార్తలు