అమెరికాలో కాల్పులు.. ఒకరి మృతి

6 Feb, 2022 04:54 IST|Sakshi

బ్లాక్స్‌బర్గ్‌: అమెరికాలోని వర్జీనియాలో ఓ హుక్కా లాంజ్‌లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు మరణించారు, మరో నలుగురు గాయపడ్డారని అధికారులు ప్రకటించారు. బ్లాక్‌బర్గ్‌ డౌన్‌టౌన్‌లోని మెలోడీ హుక్కా లాంజ్‌లో శుక్రవారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఈ కాల్పులు జరిపింది ఎవరు? అందుకు గల కారణాలు ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు.   

మరిన్ని వార్తలు