Pixie Curtis: పదేళ్ల బాలిక సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌.. నెలకు కోటిపైనే ఆదాయం...

9 Dec, 2021 11:39 IST|Sakshi
పిక్సిస్‌ కర్టిస్‌

విజయానికి వయసు ఎప్పటికీ అడ్డంకి కాదు. సాధారణంగా 16, 17 యేళ్ల నుంచి అంతకంటే పెద్ద వయసున్నవారు బిజినెస్‌ లేదా జాబ్‌ చేయడం చూస్తుంటాం! కానీ 10 యేళ్ల వయసున్న పిల్లలెవరైనా నెల​కు ఏకంగా కొట్ల రూపాయలను సంపాదించడం కనీవినీ ఎరుగునా? మీరు విన్నది అక్షరాల నిజం.. ఐతే ఇదంతా ఎలా సాధ్యపడిందబ్బా! అని ఆశ్చర్యంతో తలమునకలైపోతున్నారని తెలుస్తుందిలే.. వివరాల్లోకెళ్తే..

ఆస్ట్రేలియాకు చెందిన పిక్సిస్‌ కర్టిస్‌ అనే 10 యేళ్ల బాలిక తల్లి సహాయంతో బొమ్మల వ్యాపారం (టాయ్‌ బిజినెస్‌) చేస్తోంది. తద్వారా నెలకు రూ.1 కోటి 4 లక్షలకు పైనే సంపాదిస్తోంది. కలర్‌ఫుల్‌ బొమ్మలతోపాటు, ఆకర్షనీయమైన హెయిర్‌ బ్యాండ్స్‌, క్లిప్స్‌ వంటి (హెయర్‌ యాక్ససరీస్‌) వాటిని నెముషాల్లో అమ్మి పెద్ద మొత్తంలో ఆర్జిస్తుంది.

బాలిక తల్లి రాక్సి మీడియాతో మాట్లాడుతూ.. ‘చాలా చిన్న వయసులోనే నా కూతురు బిజినెస్‌లో విజయం సాధించి నా కలను నెరవేర్చింది. నాచిన్నతనంలో 14 యేళ్ల వయసులో మెక్‌డోనాల్డ్స్‌లో పనిచేశాను. కానీ నా కూతురు అంత​​కంటే ఎక్కువే సంపాదిస్తోంది. పిక్సిస్‌ సిడ్నీలో ప్రైమరీ స్కూల్‌లో చదువుతూ బిజినెస్‌ చేస్తోంది. తానుకోరుకుంటే 15 యేళ్లకే రిటైర్‌ అయ్యేలా కూడా ప్లాన్‌ చేశాం. అంతేకాదు కోటి 41 లక్షల రూపాయల విలువైన మెర్సిడెస్‌ కారు కూడా నా కూతురికి ఉంద’ని పేర్కొంది.

చదవండి: ‘ఇప్పటికే ఇద్దరాడపిల్లల్ని కన్నాను’..! రోజుల పసికందును చంపిన తల్లి..

మరిన్ని వార్తలు