84 ఏళ్లుగా ఒకే కంపెనీలో పని.. గిన్నిస్‌ రికార్డులో చోటు

1 May, 2022 01:48 IST|Sakshi

సాధారణంగా ఓ కంపెనీలో ఎక్కువలో ఎక్కువ ఐదేళ్లు లేదా పదేళ్లు.. మహా అయితే 20 ఏళ్లు పని చేస్తుంటారు. కానీ ఒకాయన మాత్రం 84 ఏళ్లుగా ఒకే కంపెనీలో పని చేస్తున్నారంటే నమ్ముతారా! నమ్మడమా.. ఆశ్చర్యపోయాం అంటారా! బ్రెజిల్‌కు చెందిన వాల్టర్‌ ఆర్థమన్‌ 1934 నుంచి ఒకే కంపెనీలో పని చేస్తున్నారు మరి. పదిహేనేళ్లు ఉన్నప్పుడు 1938లో ఓ టెక్స్‌టైల్‌ కంపెనీలో షిప్పింగ్‌ విభాగంలో అసిస్టెంట్‌గా చేరారు. తర్వాత అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌గా.. తర్వాత సేల్స్‌ మేనేజర్‌గా.. ఇలా ఎదుగుతూ వచ్చారు. ఈ 84 ఏళ్ల కాలంలో సేల్స్‌ ట్రిప్‌లో భాగంగా ప్రపంచమంతా చుట్టొచ్చారు. బ్రెజిల్‌లోని అన్ని విమానయాన సంస్థ విమానాలూ ఎక్కేశారు. ప్రస్తుతం వాల్టర్‌కు 100 ఏళ్లు.

ఒకే కంపెనీలో ఎక్కువ కాలం పని చేసిన వ్యక్తిగా ఈ ఏడాదిలోనే గిన్నిస్‌ రికార్డుకెక్కారు. 100 ఏళ్ల వయసున్నా కంపెనీ నుంచి పదవీ విరమణ పొందే ఆలోచనేమీలేదని చెబుతున్నారు. అ​ప్పట్లో పని చేసే రోజులను, ఇ​ప్పటి రోజులను గుర్తుచేసుకుంటూ.. ‘ఇప్పుడంతా సులువైపోయింది. చేతిలో ఫోన్‌. ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ ఉంటే చాలు. ప్రపంచంలోని ఏ మూలలో ఉన్నా బిజినెస్‌ను చూసుకోవచ్చు’ అన్నారు. ఇ​ప్పటి యవతకు సలహా ఏమైనా ఇస్తారా అటే.. ‘అస్సలు కో​ప్పడవద్దు. నవ్వుతూ పని చేసుకుపోండి. నచ్చింది చేయండి’ అని చెప్పారు. 

మరిన్ని వార్తలు