Sri Lanka: కోవిడ్‌ నిబంధనల ఉల్లంఘన.. 24 గంటల్లో 1,047 మంది అరెస్ట్‌

1 Jun, 2021 15:32 IST|Sakshi

కొలంబో(శ్రీలంక): చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజు భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. పెద్ద, చిన్న అనే తేడాలేకుండా ప్రతి దేశం కోవిడ్‌ను అరికట్టడానికి కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి. అయితే తాజాగా శ్రీలంకలో క్యారంటైన్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు సోమవారం 1,047 మందిని అరెస్ట్‌ చేసినట్టు పోలీసు మీడియా ప్రతినిధి డీఐజీ అజిత్ రోహనా  వెల్లడించారు.

మాతలేలో 160 మందిని, నికవేరటియాలో 119 మందిని, కాండీలో 98 మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. గత ఏడాది అక్టోబర్‌ 31 నుంచి ఇప్పటి వరకు క్యారంటైన్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు19,102 మందిని అరెస్ట్‌ చేసినట్టు పేర్కొన్నారు. కరోనా కట్టడికి సంబంధించి పర్యవేక్షణ కోసం 23,000 మంది పోలీసు అధికారులను నియమించినట్లు తెలిపారు. ఇక ఇప్పటి వరకు శ్రీలంకలో 1,83,452 కోవిడ్‌-19 కేసులు నమోదు కాగా.. 1,441 మంది కరోనా బాధితులు మరణించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) పేర్కొంది.

(చదవండి: Archaeology Dept.: ఈ ఆయుధం 7 వేల సంవత్సరాల క్రితం నాటిది!)

మరిన్ని వార్తలు