షూ జతలో ఏకంగా 119 అరుదైన సాలీళ్లు

2 Nov, 2020 17:31 IST|Sakshi
షూలో బయటపడ్డ సాలీళ్లు

మనీలా : ఓ పార్శిల్‌ను ఓపెన్‌ చేసి చూసిన నినోయ్‌ అక్వినో ఇంటర్‌నేషనల్‌ ఏయిర్‌పోర్టు అధికారులకు వింతైన అనుభవం ఎదురైంది. షూ జతలో ఏకంగా 119 అరుదైన సాలీళ్లు బయటపడటంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఫిలిప్పీన్స్‌ ఎన్‌ఏఐఏ ఏయిర్‌పోర్టులో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. గత నెల 28న ఎన్‌ఏఐఏ కస్టమ్స్‌ అధికారులు స్మగ్లింగ్‌ జరుగుతోందన్న సమచారంతో సోదాలు చేపట్టారు. ఓ పార్శిల్‌ను ఓపెన్‌ చేసి చూడగా అందులో స్పోర్ట్స్‌ షూలు కనిపించాయి. ( వారిపై జీవితాంతం నిషేధం విధించండి! )

వాటిని పరీక్షించగా చిన్న పాటి ప్లాస్టిక్‌ బాటిళ్లలో అరుదైన జాతికి చెందిన 119 సాలీళ్లు బయటపడ్డాయి. దీంతో అధికారులు వాటిని వన్య ప్రాణి సంరక్షణా కేంద్రానికి అప్పగించారు. కేసు నమోదు చేసుకుని స్మగ్లింగ్‌కు పాల్పడిన వారి కోసం అన్వేషిస్తున్నారు. ఆ పార్శిల్‌పై టూ అడ్రస్‌ కేవిట్‌లోని జనరల్‌ ట్రియాస్‌కు ఉన్నట్లు గుర్తించారు. ​​​​​​( ఇక లేదనుకున్నారు, కానీ 27 ఏళ్ల తరువాత...)

మరిన్ని వార్తలు