చూస్తుండగానే పేలిపోయిన పెట్రోల్‌ బంక్‌

11 Aug, 2020 16:17 IST|Sakshi

12 మందికి తీవ్ర గాయాలు

మాస్కో: కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ఆగస్టు నెలలో జరుగుతున్న వరుస అగ్ని ప్రమాదాలు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా రష్యాలోని ఓ పెట్రోల్‌ బంక్‌లో భారీ పేలుడు సంభవించింది.. సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. వోల్గోగ్రాడ్‌ పెట్రోల్‌ స్టేషన్‌లో మంటలు చెలరేగడంతో వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక దళం అక్కడకు చేరుకుంది. మంటల ధాటికి అంతలోనే భారీ పేలుడు చోటుచేసుకోవడంతో పెట్రోల్‌ బంక్‌ నామరూపాల్లేకుండా పోయింది. పెట్రోల్‌ స్టేషన్‌కు సంబంధించిన పైప్‌లైన్లు కూడా పేలి పోవడంతో సుమారు 200 మీటర్ల మేర మంటలు వ్యాపించాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి. ఇక లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో జరిగిన భారీ పేలుడు ఘటనతో 160 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.
(నిరసనలు: లెబనాన్‌ ప్రధాని రాజీనామా)

మరిన్ని వార్తలు