బహుళ అంతస్తుల భవనం... ఏకంగా 127 ఫ్లాట్లు...ఉండేది ఒకే ఒక్కడు!

11 Aug, 2022 20:16 IST|Sakshi

కాల పరిమితి దాటిని బహుళ అంతస్తుల భవనాన్ని కూల్చడం సహజం. నివాసితులను అక్కడ నుంచి వెళ్లిపోమని చెప్పి సదరు బిల్డర్లు ఎంతో కొంత డబ్బులు చెల్లించడం వంటివి జరుగుతుంది. అలానే ఇక్కడొక భవనాన్ని కూల్చేయలనుకున్నారు. అందుకోసం నివాసితులను ఖాళీ చేయించారు కూడా. కానీ ఒకే ఒక్కడు మాత్రం ఆ భవనాన్ని ఖాళీ చేసి వెళ్లటం లేదు. ఒంటరిగా అక్కడే ఉంటున్నాడు. 

వివారల్లోకెళ్తే....బ్రిటన్‌లోని స్కాట్లాండ్‌లో  నార్త్‌ లానార్క్‌షైర్‌ కౌన్సిల్‌లో ఒక బహుళ అంతస్తుల భవనం ఉంది. అందులో ఏకంగా 127 ఫ్లాట్లు ఉన్నాయి. అయితే నగరానికి దూరంగా ఉండటం పెద్ద పెద్ద గాలులకు అద్దలు పగిలిపోవడం, దొంగలు పడటం తరుచుగా జరుగుతోందని ఫిర్యాదలు రావడంతో ఆ భవనాన్ని కూల్చివేయాలని కౌన్సిల్‌ నిర్ణయించింది.

దీంతో ఆ భవనంలోని నివాసితులందర్నీ ఖాళీ చేయించారు. ఐతే ఒకే ఒక్క వ్యక్తి నిక్‌ విస్నీవ్సీక్‌ అనే వ్యక్తి మాత్రం ససేమిరా ఖాళీ చేయనని చెప్పేశాడు. పైగా అతనోక్కడే ఒంటరిగా ఉంటున్నాడు. ఆఖరికి కౌన్సిల్‌ అతనకి సుమారు రూ. 34 లక్షలు తోపాటు మరోచోట అద్దెకున్నందుకు అక్కడ అద్దెను కూడా రెండేళ్ల వరకు చెల్లిస్తామని మంచి ఆఫర్‌ కూడా ఇచ్చింది. అయినా కుదరదని నిక్‌ తెగేసి చెప్పేశాడు.

దీంతో కౌన్సిల్‌ అతను వెళ్లిపోవాలని ఆ భవనం శుభ్రం చేయకుండా, సెక్యూరిటీని తీసేసి, పట్టించుకోకుండా వదిలేసింది. అయినా అతను తన ప్లాట్‌ని వదిలి వెళ్లనని, వాళ్లు ఇచ్చే డబ్బులుతో మరో ఫ్లాట్‌ కొనేందుకు సరిపోవని అన్నాడు. నిక్‌ రైట్‌ టు బై స్కీమ్‌ కింద ఆ ఫ్లాట్‌ని 2017లో కొనుక్కున్నాడు. తాను ఒంటరిగా ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఉంటాననే చెబుతున్నాడు. కౌన్సిల్‌ మాత్రం ఇది సున్నితమైన సమస్య అతన్ని ఎలాగైన ఖాళీ చేయిస్తానని చెబుతోంది. 

(చదవండి: Viral Video: ఎంత పెద్ద మనసు ఆ చిన్నారులది!)

మరిన్ని వార్తలు