బంగ్లాదేశ్‌లో సగం పైగా జనాభా అంధకారంలోనే...

4 Oct, 2022 19:39 IST|Sakshi

ఢాకా: 130 మిలయన్ల మందికి పైగా ప్రజలు అంధకారంలోనే ఉన్నారని బంగ్లాదేశ్‌ ప్రభుత్వం పేర్కొంది. మంగళవారం మధ్యహ్నాం నుంచే విద్యుత్‌ సరఫరా నిలచిపోయినట్లు తెలిపింది. సుమారు 80 శాతం దేశంలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయినట్లు బంగ్లాదేశ్‌ పవర్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు వెల్లడించింది. వాయువ్య ప్రాంతాల మినహ మిగతా ప్రాంతాలకు పవర్‌ సప్లై నిలిచిపోయినట్లు బంగ్లాదేశ్‌ ప్రతినిధి షమీమ్‌ ఎహ్సాన్‌ తెలిపారు.

ఎందువల్ల ఈ పరిస్థితి తలెత్తిందనేది తెలియరాలేదని, బహుశా సాంకేతిక సమస్య అయ్యిండొచ్చని ఎహ్సాన్‌ అన్నారు. ఐతే బంగ్లాదేశ్‌ కేంద్ర సాంకేతిక మంత్రి జునైద్‌ పాలక్‌ రాజధాని ఢాకాలో  రాత్రి 8 గం.ల కల్లా విద్యుత్‌ పునరుద్ధరింపబడుతుందని ఫేస్‌బుక్‌లో తెలిపారు. ఉక్రెయిన్‌ రష్య యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగాయి, అందువల్లే బంగ్లాదేశ్‌ ఈ విద్యుత్‌ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

ఇటీవల కాలంలో గత కొద్ది నెలలుగా ఈ సంక్షోభం మరింత ఎక్కువైంది. అదీగాక విద్యుత్‌కి సరఫరాకు సరిపడా డీజిల్‌, గ్యాస్‌ల దిగుమతి చేసేకునేందుకే బంగ్లాదేశ్‌ ఇబ్బందులు పడటంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్‌ చివరిసారిగా 2014 నవంబర్‌లో ఇంత పెద్ద విద్యుత్‌ సంక్షోభాన్ని చవివచూసింది.ఏదిఏమైన దేశంలో దాదాపు 70 శాతం మంది సుమారు 10 గంటలపాటు విద్యుత్‌ లేకుండా గడిపారు. 

(చదవండి: రెస్టారెంట్‌ సిబ్బంది నిర్వాకం...వాటర్‌ బాటిళ్లలో యాసిడ్‌ అందించి...)

మరిన్ని వార్తలు