Playing Chicken: పందెంకాసి రైలుకు అడ్డంగా నిలబడింది..

8 Jul, 2021 10:37 IST|Sakshi
డ్రోన్‌ దృశ్యం

లండన్‌ : పందెం సరదా ఓ బాలిక ప్రాణం మీదకు తెచ్చింది. చావు తప్పినా.. చేసిన తప్పుకు పోలీసు కేసులు ఎదుర్కొంటోంది. ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్‌షేర్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. కేంబ్రిడ్జ్‌షేర్‌కు చెందిన ఓ 15 ఏళ్ల బాలిక కొద్దిరోజుల క్రితం తన మిత్రులతో ప్లేయింగ్‌ చికెన్‌ పందెం కాసింది. ఈ పందెం ప్రకారం ఆమె రైల్వే ట్రాక్‌ మీద.. ఎదురుగా వస్తున్న రైలుకు అడ్డంగా నిలబడాలి. రైలు చాలా దగ్గరకు వచ్చేంతవరకు ఎవరైతే పక్కకు తప్పుకోకుండా నిలబడతారో వారు విజయం సాధించినట్లు. బాలిక కూడా అలానే నిలబడింది. ఇది గమనించిన ఓ మహిళ బాలికను రక్షించటానికి ప్రయత్నించింది.

అయితే, సదరు మహిళను కొట్టి అక్కడినుంచి పంపేసింది. తను రైలుకు అడ్డంగా నిలబడిపోయింది. ఈ నేపథ్యంలో పోలీసుల నిఘా డ్రోన్‌ బాలిక రైల్వే ట్రాక్‌పై ఉన్నట్లు గుర్తించింది. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. ఆ లోపే బాలిక రైలునుంచి తప్పించుకుని ఇంటికి వెళ్లిపోయింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు బాలికను అరెస్ట్‌ చేశారు. నిబంధనల ఉల్లంఘణ, దాడి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు