చైనాలో రెస్టారెంట్‌ కూలి 17 మంది మృతి

30 Aug, 2020 05:04 IST|Sakshi

బీజింగ్‌: ఉత్తర చైనాలోని షాంగ్జి ప్రావిన్సులో ఒక రెస్టారెంటు కుప్పకూలి 17 మంది మరణించారు. లిన్‌ఫెన్‌ అనే పట్టణంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. రెండంతస్తుల ఈ హోటల్‌ భవనం శిథిలాల నుంచి మొత్తం 45 మందిని బయటకు తీశారు. వీరిలో 17 మంది విగతజీవులుగా బయటపడగా, 28 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. భవనం కూలిపోవడానికి కారణాలేమిటనేది వెంటనే తెలియరాలేదు.  

మరిన్ని వార్తలు