World Ugliest Dog 2022: ప్రపంచంలోనే అందవిహీనమైన ముఖం.. కదిలించే కథ

28 Jun, 2022 10:55 IST|Sakshi

Mr Happy Face Winner: పలు దేశాల్లో చాలా చాలా వింత వింత పోటీలు జరుగుతుంటాయి. ఇవేం పోటీలు అన్నంత విచిత్రంగా ఉంటాయి. అందమైన కుక్కల పోటీలు లేదా చురుకైన లేక తెలివైన కుక్కల కాంపిటీషన్‌ వంటి విచిత్రమైన పోటీలు గురించి విన్నాం. అంతేగానీ అత్యంత అసహ్యంగా ఉండే శునకాల పోటీ గురించి విన్నారా! ఔను అత్యంత వికారంగా ఉంటే శునకాల పోటీ కూడా ఉందటా. పైగా ఏటా భారీ ఎత్తున నిర్వహిస్తారట!

అమెరికాలో ఆరిజోనాకు చెందిన 17 ఏళ్ల చివావా మిక్స్‌ అనే కుక్క.. ప్రపంచంలోనే అత్యంత అంద విహీనమైన కుక్కగా ఎంపికైంది. కాలిఫోర్నియాలో సోనోమా మారిన్‌ఫెయిర్‌ సందర్భంగా మిస్టర్‌ హ్యాపీ ఫేస్ అను అత్యంత అసహ్యమైన కుక్కల కాంపిటీషన్‌ జరుగుతుంది. ఐతే దాదాపు 50 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కరోనా మహమ్మారీ కారణంగా రెండేళ్ల తదనంతరం, మళ్లీ ఇప్పుడు ఈ పోటీని నిర్వహించారు. ఆ కుక్క ముఖమంతా కణితులు, పైగా నరాల సంబంధిత వ్యాధితో నుంచోలేని అత్యంత దీనావస్థలో ఉంది.

ఆ కుక్కకథ.. ఆ పోటీలు నిర్వహిస్తున్న న్యాయ నిర్ణేతలను కదిలించడంతో విజేతగా ప్రకటించారు. అంతేకాదు ఈ పోటీలో పాల్గొన్న మిగతా ఎనిమిది కుక్కలను వెనక్కినెట్టి మరీ విజేతగా నిలివడం విశేషం. ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా ఆ కుక్క సంతోషంగా ఉన్నప్పుడు డీజిల్‌ ట్రక్‌లాంటి చిన్న శబ్దాన్ని కూడా చేస్తుందట. యజమాని జెనెడా బెనెల్లీ ఆరిజోనాలో ఆశ్రయం పొందుతున్న ఈ కుక్కని 2021లో దత్తత తీసుకున్నాడు. అప్పుడు ఈకుక్క డైపర్‌ వేసుకుని కణుతులతో ఉండి దారుణమై ఆరోగ్య సమస్యలతో దీనస్థితిలో ఉందని పేర్కొన్నాడు. ఐతే ఈ కుక్క ప్రస్తుతం ఒక నెల మాత్రమే జీవించగలదని యజమాని జెనెడా చెబుతున్నాడు. ఈ కుక్క ఈ పోటీలో విజేతగా నిలవడంతో సుమారు రూ. లక్షరూపాయాల ప్రైజ్‌మనీ తోపాటు న్యూయార్క్‌ సిటీని చుట్టివచ్చే అవకాశాన్ని కూడా పోందింది. పేరుకే ఇది అత్యంత అందవిహీనమైనం కావొచ్చు.. కానీ, దానంత అందమైన జీవితం మరొకటి లేదంటున్నారు పలువురు నెటిజన్స్‌.

(చదవండి: ఘనంగా పెంపుడు కుక్క బర్త్‌ డే వేడుక...ఏకంగా 4 వేలమందికి...)

మరిన్ని వార్తలు