56 ఏళ్ల మహిళతో 19 ఏళ్ల యువకుడి ప్రేమ.. రెండేళ్లుగా సహజీవనం.. త్వరలోనే పెళ్లి

25 Oct, 2022 18:19 IST|Sakshi

బ్యాంకాక్‌: ప్రేమ గుడ్డిది, దానికి వయసు, పరిధి, దూరం వంటి వాటితో సంబంధం ఉండదు అనే డైలాగులు చాలా సినిమాల్లో వినే ఉంటాం. దానిని థాయ్‌లాండ్‌కు చెందిన ఓ జంట నిజం చేసి చూపుతోంది. ఇద్దరి మధ్య 37 ఏళ్ల వయసు తేడా ఉంది. అయినప్పటికీ.. 19 ఏళ్ల యువకుడు, 56 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఆమెతో నిశ్చితార్థం సైతం చేసుకున్నాడటా! ప్రస్తుతం వారి ప్రేమ, పెళ్లి అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చినీయాంశంగా మారింది. 

ఉత్తర థాయ్‌లాండ్‌లోని సఖోన్‌ నఖోన్‌ రాష్ట్రానికి చెందిన 19 ఏళ్ల వుతిచాయ్‌ చంతరాజ్‌ అనే యువకుడు, 56 ఏళ్ల వయసు ఉన్న జన్లా నమువాన్‌గ్రాక్ అనే‌ మహిళను పెళ్లి చేసుకోబోతున్నాడు. అతని 10 ఏళ్ల వయసున్నప్పుడు ఆమెను కలిశాడు. ఇరువురు ఇరుగుపొరుగు ఇంట్లోనే ఉండేవారు. ఈ క్రమంలో ఇంటిని శుభ్రం చేసేందుకు తనకు సాయం చేయమని వుతిచాయ్‌ని కోరేది మహిళ. ఇలా.. చిన్న చిన్న పనుల్లో సాయంగా ఉంటుండంతో ఇరువురి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 37 ఏళ్ల వయసు తేడా ఉన్నప్పటికీ గత రెండేళ్లుగా వారు సహజీవనం చేస్తున్నారు. 

‘రెండేళ్లుగా జల్నాతో ఉంటున్నాను. ఒకరు హాయిగా జీవించేలా చేయొచ్చని నా జీవితంలో తొలిసారి తెలుసుకున్నా. పాడైపోయిన ఆమె ఇంటిని చూశాను. ఆ తర్వాత ఆమెకు మంచి జీవితం అందించాలని ఆలోచించాను. ఆమె చాలా కష్టపడి పని చేసే వ్యక్తి, నిజాయితీగా ఉంటుంది. ఆమెను నేను ఆరాధిస్తాను.’ అని పేర్కొన్నాడు. 

మరోవైపు.. వయసులో తేడా పట్ల వారు ఆందోళన చెందటం లేదు. ఇంటర్వ్యూలు, బహిరంగంగా తమ బంధాన్ని వెల్లడించటంలో ఎలాంటి ఇబ్బందులు పడటం లేదు. నగరంలో బయటకి వెళ్లినప్పుడు చేతులు పట్టుకుని, ముద్దులు పెట్టుకుంటూ సరదాగా కనిపిస్తున్నారు కూడా. అయితే.. జల్నా తన భర్తతో విడిపోయింది. ఆమెకు ముగ్గురు 30 ఏళ్లకుపైగా వయసున్న పిల్లలు ఉన్నారు. వుతిచాయ్‌ తనలో యువతిననే ఆలోచన కలిగించాడని చెబుతోంది. ‘వుతిచాయ్‌ నాకు ఒక సూపర్‌ హీరో. ప్రతి రోజు నాకు సాయం చేస్తాడు.అతను పెద్దవాడయ్యాక మా ఇరువురి మధ్య భావాలు మొదలయ్యాయి.’ అని పేర్కొంది జల్నా. త్వరలోనే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపింది.

ఇదీ చదవండి: వీడియో: చెంప దెబ్బకు డెలివరీబాయ్‌ ఇచ్చిన రియాక్షన్‌.. మరీ వయొలెంట్‌గా ఉందే!

మరిన్ని వార్తలు